సేవా నిబంధనలు

Google ("సేవ") నుండి చాట్ ఫీచర్‌లను ఉపయోగించడం ద్వారా, మీరు Google సేవా నిబంధనలు, Google గోప్యతా విధానం తో పాటు ఈ అదనపు నిబంధనలు (మొత్తంగా “సేవా నిబంధనలు”)కు కట్టుబడి ఉండడానికి అంగీకరించి ఆమోదిస్తున్నారు. చాట్ ఫీచర్‌లు టెలిఫోన్ నంబర్‌లతో పనిచేస్తాయి, అందుచే అవి టెలిఫోన్ నంబర్‌లను చేరుకోవడానికి ఇతర సర్వీసు ప్రొవైడర్‌ల గుండా పోవచ్చు. సేవను అందించడానికి మీ పరిచయాలు అప్పుడప్పుడూ చాట్ ఫీచర్ సామర్థ్యాల కోసం తనిఖీ చేయవచ్చని మీరు అంగీకరిస్తున్నారు. మీ టెలిఫోన్ నంబర్‌ను ధృవీకరించడానికి మరియు సేవను అందించడానికి పరికర ఐడెంటిఫైయర్‌లు లేదా SIM కార్డ్ సమాచారంతో సహా, మీ పరికర సమాచారాన్ని మీ క్యారియర్‌తో Google అప్పుడప్పుడు పంచుకుంటుంది. ఈ సేవా నిబంధనలు మీ క్యారియర్ అందించిన ఫీచర్‌లు మరియు సేవలకు వర్తించవు (ఉదా., క్యారియర్ కాలింగ్ మరియు సందేశాన్ని పంపడం, SMS/MMS/మొదలైన వాటితో సహా.). మీ సందేశ యాప్ యొక్క సెట్టింగ్‌లలో దాన్ని ఆఫ్ చేయడం ద్వారా మీరు సేవ యొక్క మీ ఉపయోగాన్ని నిలిపివేయవచ్చు.

Google LLC యొక్క అనుబంధ సంస్థ, Jibe Mobile, Inc. ద్వారా సేవ అందించబడింది.